నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 21:49

16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు ₹2102 కోట్లు..

దిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది..

ఈ ఏడాది బడ్జెట్‌లో (Union Budget) ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు..

ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు..

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 20:43

ఢిల్లీలో మోడీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ:జూన్ 26

అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.....

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 20:41

నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

నల్లగొండజిల్లా :జూన్ 26

జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు.

పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 17:36

Uppal Skywalk: 'ఉప్పల్‌ స్కైవాక్‌'ను ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ దీన్ని నిర్మించింది..

660 మీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్‌కు మొత్తంగా రూ.25 కోట్లు కేటాయించారు.

నాలుగు వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు.

మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్‌లను ఏర్పాటు చేశారు..

స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

• నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు

• నిధులు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి

• పొడవు: 660 మీటర్లు

• వెడల్పు: 3, 4, 6 మీటర్ల చొప్పున

• ఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం

• మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు: 25-30 వేల మంది

• రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య: సుమారు 20 వేలు

• పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 17:33

సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించిన కేంద్ర ఎన్నికల అధికారి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ అధికారి అబాసాహెబ్ ఆత్మారాం కావ్లే అన్నారు. పట్టణంలోని ఈవీఎం గోడౌన్ లో రానున్న ఎన్నికల కొరకు సిద్ధం చేస్తున్న ఈవీయం ఎఫ్.ఎల్.సీ, వెబ్ కాస్టింగ్, ఈవీఎంలను భద్రపరచే గదిని ఆయన సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భం కావ్లే మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న ఎఫ్.ఎల్.సీ, ఎన్నికల ఏర్పాట్లు ఈసీఐ నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఎఫ్.ఎల్.సీ నిర్వహణ, ఈవీఎంలు గోడౌన్ లోకి వెళ్లడం మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీ ప్యాట్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రక్రియ, మాక్ పోల్, ఈవీఎం భద్రపరిచే గది, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం, సీసీ కెమెరాల ద్వారా నిర్వహిస్తున్న వెబ్ కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది, వ్యారికేటింగ్ తదితర విషయాలను పరిశీలించడంతో పాటు పలు విషయాలను గురించి జిల్లా కలెక్టర్, సీపీలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎ.ఎల్.సీలో పాల్గొనడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఏ.వో జగత్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ మోహనా చారి, సీపీఐ(ఎం) మేలుకూరి వాసుదేవ రెడ్డి, బీఎస్పీ గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ సత్తినేని శ్రీనివాస్, టీడీపీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు......

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 17:31

'కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో' నినాదంతో ముందుకు సాగాలి: రాహుల్‌ గాంధీ..

ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్‌ , జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. వీరిద్దరితోపాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ముఖ్య నాయకులు పిడమర్తి రవి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా ఉన్నారు..

ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది.

ఈ సందర్భంగా జూలై 2న ఖమ్మం సభకు రావాలని రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. టీ కాంగ్రెస్‌లో ఘర్‌ వాపసి జరుగుతోందని.. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కాగా తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, సీనియర్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌, జూపల్లి కృష్ణారావు నేడు(సోమవారం) రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్నారు. ఇందులో భాగంగానే వీరు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక, ఢిల్లీలో ఉన్న వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ‍కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పొంగులేటి, జూపల్లి ఉన్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరంతా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి పయనమయ్యారు.

ఈ సందర్బంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 12:54

మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతికి హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి, అభినందించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. బస్సులో మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఇక సీఎం బస్సు వెంట 600 వాహనాలు భారీ కాన్వాయ్‌గా బయలు దేరాయి. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.00 గంటకు ఒమర్గాకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి.. సాయంత్రం 4.30 గంటలకు షోలాపూర్ చేరుకుంటారు. ఈ రోజు షోలాపూర్‌లో బస చేస్తారు. ఆ సమయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం అవుతారు. అలాగే తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు షోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. అక్కడి విఠోభా రుక్మిణి మందిరంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని తుల్జాభవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు...

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతికి హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి, అభినందించారు. ఆ తర్వాత ఆయన ప్రత్య

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 10:58

ఉప్పల్‌లో మరో మణిహారం నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్‌లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్‌ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

రామంతాపూర్‌, సికింద్రాబాద్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వైపు, ఉప్పల్‌ నుంచి రామంతాపూర్‌, సికింద్రాబాద్‌ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్‌ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు.

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌తో ఉప్పల్‌ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు.

నగరంలోనే మొదటిది..

దాదాపు రూ.25 కోట్లతో హెచ్‌ఎండీఏ ఉప్పల్‌ స్కైవాక్‌ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్‌ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్‌ స్టీల్‌ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్‌ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్‌ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది.......

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 10:57

కారు ఎక్కుతాం ప్లీజ్‌..లిఫ్ట్!

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. సర్వేలు, సీట్ల పంపకం అంటూ ఏదో ఒక అంశంపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇతర పార్టీల సంగతేమో కానీ అధికార బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు అధికారులు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

కొలువు వదిలి కారు ఎక్కి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇలాంటి వారు ఐదారుగురు ఉన్నారు. ఎన్నికల టికెట్‌ ఆశిస్తున్న వీరంతా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని ఆ శాఖ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిజానికి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పేరే ఇన్నాళ్లూ ఎన్నికల రేసులో వినిపించేది. తాజాగా వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పేరు ఈ జాబితాలో చేరింది.

అంతేకాక, రమేశ్‌ రెడ్డికి టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. 2017 జూన్‌ నుంచి డీఎంఈగా కొనసాగుతున్న రమేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ వద్ద మంచి పేరుందనే ప్రచారమే ఇందుకు కారణం. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తరపున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన రమేశ్‌రెడ్డికి విద్యార్థి నాయకునిగా పనిచేసిన అనుభవమూ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రమేశ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జహీరాబాద్‌ లేదా కంటోన్మెంట్‌ నుంచి ఆయన టికెట్‌ ఆశిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి, 2018లో ఎర్రోళ్ల ఉమ్మడి మెదక్‌ జిల్లా అందోల్‌ సీటు ఆశించినా అధిష్ఠానం టికెటివ్వలేదు. రంగారెడ్డి డీఎంహెచ్‌వో ఆఫీసులో పనిచేస్తున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. రాజేందర్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ డీఎంహెచ్‌వోతోపాటు నీలోఫర్‌లో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌ కూడా బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. డాక్టర్‌ లాలూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్టీ స్థానమైన దేవరకొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.

కొత్తగూడెం బరిలో డీహెచ్‌ గడల

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తన సొంత నియోజకవర్గం కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తండ్రి పేరిట ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాక, ఆ నియోజకవర్గంలో డీహెచ్‌ గడల సామాజికవర్గపు ఓట్లు 35వేల వరకు ఉన్నాయి. ఇప్పటికే సామాజిక వర్గ పెద్దలతో పలుమార్లు భేటి అయిన ఆయన వారి మద్దతు కూడగట్టినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆశీస్సులతోనే గడల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరోపక్క, కొత్తగూడెం సిటింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వయసు పైబడటం, ఆయన కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలుండటంతో ఈసా రి ఆ కుటుంబానికి టికెట్‌ దక్కదని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగి తే ఆ స్థానంలో గులాబీ పార్టీకి మరో బలమైన నాయకుడు లేరు. దీంతో ఆ టికెట్‌ ఆశిస్తున్న గడల ఎన్నికల బరిలో నిలవాలని పట్టుదలగా ఉన్నారని సమాచారం...

నిజంనిప్పులాంటిది

Jun 26 2023, 10:55

పాఠశాలల్లో నో "బ్యాగ్" డే ప్రవేశపెట్టనున్న సర్కార్?

విద్యార్థులకు పుస్తకాల భారాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ర్టంలోని అన్ని పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన అందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు.

28 రకాల కార్యకలాపాలు

ప్రైమరీ విభాగంలో షో టైమ్, ఫన్ స్టేషన్, క్రియేటివ్ సర్కిల్ అనే మూడు సెషన్లు ఉంటాయి. 1వ మరియు 2వ తరగతి విద్యార్థులు తమ కుటుంబం గురించి మాట్లాడడం, కుటుంబ సభ్యుల్లో ఒకరిలా నటించడం వంటి టాస్క్ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకతను పెంపొందించుకునే కుటుంబ సభ్యుని స్కెచ్‌ని గీయమని కోరతారు. వీటితో పాటు విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల సందర్శనలు, సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్స్ వంటి ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి.

3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు

మూడు నుంచి ఐదు తరగతులు చదివే విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత అభ్యాసంలో భాగంగా, జీవనోపాధిపై ఒక థీమ్‌ను అభివృద్ధి చేశారు. వృత్తిలో ఉపయోగించే పనిముట్లను గీయడం, నచ్చిన వృత్తిపై మాట్లాడడం, ఆ పనిని చేయడంపై అసైన్‌మెంట్ ఇస్తారు.

సెకండరీ స్థాయిలో

సెకండరీ స్థాయిలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ సర్వే, పోస్ట్ ఆఫీస్, నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శన, ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్, అవుట్‌డోర్ మరియు ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి. సెకండరీ స్కూల్ స్థాయి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, దాని అప్లికేషన్లు, కెరీర్ అవకాశాలను సైతం పరిచయం చేయనున్నారు. పా శాలలు ఆరంభమై 12 రోజులు కావడంతో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంది. జులై నుంచి కచ్చితంగా అమలు చేసేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి...